ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 22, 2021, 8:12 AM IST

ETV Bharat / state

రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో.. అనధికార కర్ఫ్యూ, లాక్​డౌన్!

కరోనా రెండోదశ ప్రళయంగా మారిపోతున్న వేళ.. రాష్ట్రవ్యాప్తంగా ఎవరికి వారే కట్టడి చేస్తున్నారు. తీవ్రత అధికంగా ఉన్నచోట్ల వ్యాపార సంఘాలు చర్చించుకుని పనివేళలు కుదించుకుంటున్నాయి. మరికొన్ని చోట్ల అధికార యంత్రాంగం, స్థానిక సంస్థలు నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నాయి. మధ్యాహ్నం తర్వాత నుంచి దుకాణాలు, ఇతర వాణిజ్య సముదాయాల్ని మూసేస్తున్నారు. రాత్రి వేళల్లో అనధికారిక కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ వాతావరణం కనిపిస్తోంది. సాధారణంగా వేసవిలో సాయంత్రమే ఎక్కువ రద్దీకి అవకాశం ఉంటుంది. దాన్ని నియంత్రించి కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకే ఈ స్వచ్ఛంద ఆంక్షలు అమలు చేస్తున్నారు. మధ్యాహ్నం వరకే దుకాణాలు తెరుచుకుంటాయని ప్రకటించటంతో సమీప ప్రాంతాల నుంచి వచ్చేవారి రద్దీ బాగా తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు.

unofficial curfew, lock down in andhrapradhesh
రాష్ట్రంలో పలుచోట్ల అనధికారిక కర్ఫ్యూ, లాక్​డౌన్

సాయంత్రం వరకే వ్యాపారాలు..

*గుంటూరులో ఈ నెల 25 నుంచి రాత్రి 7- ఉదయం 6 గంటల మధ్య పూర్తి కర్ఫ్యూ అమలుచేయాలని నిర్ణయించారు. బుధవారం సాయంత్రం 6 గంటలకే దుకాణాలు మూతపడ్డాయి. గురువారం నుంచి నరసరావుపేటలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకే వ్యాపార, వాణిజ్య సంస్థలు పనిచేయాలని నిర్ణయించారు.

*విజయనగరంలో సాయంత్రం 6 గంటల తర్వాత దుకాణాలు మూసేయాలని ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ నిర్ణయించింది. బొబ్బిలిలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే కిరాణా, కూరగాయల దుకాణాలు తెరుస్తున్నారు. నెల్లూరు జిల్లా కావలిలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే దుకాణాలు తెరవాలని ఆర్డీవో నిషేధాజ్ఞలు విధించారు.

*పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు, పాలకొల్లు, ఆచంట తదితర ప్రాంతాల్లో అన్ని దుకాణాలూ సాయంత్రం 6 గంటలకు స్వచ్ఛందంగా మూసేస్తున్నారు. ఆదివారం పూర్తిగా తెరవకూడదని నిర్ణయించారు.

ఆ ప్రాంతాల్లో మధ్యాహ్నం వరకే...

విశాఖపట్నం జిల్లా దేవరాపల్లి, ముంచంగిపుట్టులో ఈ నెల 30వ తేదీ వరకూ మధ్యాహ్నం 2 గంటల వరకే దుకాణాలు తెరవాలని వ్యాపారులు తీర్మానించి అమలు చేస్తున్నారు. మన్యంలోని డుంబ్రిగూడలో మధ్యాహ్నం 3 గంటలు, కె.కోటపాడులో మధ్యాహ్నం ఒంటిగంట వరకే దుకాణాలు తెరుస్తున్నారు. కడప జిల్లా రైల్వేకోడూరులో మధ్యాహ్నం 2 గంటలకే దుకాణాలు మూసేస్తున్నారు.

*విజయనగరం జిల్లా సాలూరు, పార్వతీపురం, కురపాంలలో మధ్యాహ్నం 2 గంటల తర్వాత దుకాణాలు మూసేస్తున్నారు. నెల్లూరు జిల్లా గూడూరులో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 వరకే వ్యాపారాలు నిర్వహించుకోవాలని ఆర్డీవో ఆదేశించారు.నీ శ్రీకాకుళం జిల్లా పాతపట్నం, సోంపేటలో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే దుకాణాలు తెరిచేందుకు అనుమతిస్తున్నారు. నీ ప్రకాశం జిల్లాలో కరోనా కేసుల తీవ్రత అధికంగా ఉన్న 19 మండలాల్లో అధికారులు నిషేధాజ్ఞలు విధించారు. ఉదయం 6-10, సాయంత్రం 4-6 మధ్యే దుకాణాలు తెరవాలని నిర్దేశించారు.

ఇవీ చదవండి:

కొవిడ్ నియంత్రణ చర్యలపై నేడు మంత్రివర్గ ఉపసంఘం భేటీ

ఖాళీ అయిన ఆక్సిజన్​.. ఊపిరి కోసం పోరాడుతూ మహిళ మృతి

ABOUT THE AUTHOR

...view details