ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రహదారులు నిర్మించండి..మా ప్రాణాలను కాపాడండి

సెకను వృథ కావద్దని, నగరాల్లో ఆకాశమార్గాలను నిర్మిస్తోన్న ప్రభుత్వాలు, గిరిజన ప్రాంతాల్లో కనీసం వాహనాలను పంపే రహదారులను నిర్మించలేకపోతోంది. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమా, చేతకాని తనమా అని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. నవనాగరికతలోనూ గర్భణీలకను డోలీలతో తరలిస్తున్న దృశ్యాలపై పాలకులు సమాధనం చెప్పాలంటున్నారు. తక్షణమే రహదారి సౌకర్యం కల్పించాలని వారు రిలే నిరాహార దీక్షలకు దిగారు. ఇకనైన ప్రభుత్వం కదులుతుందా లేదా అనేది చూడాలి..!

tribals protest at itda parvathipuram in vizianagaram

By

Published : Sep 7, 2019, 12:35 PM IST

రహదారులు నిర్మించండి...మా ప్రాణాలు కాపాడండి..

డోలీ కష్టాల నుంచి తమను గట్టెక్కించాలని సాలూరు గిరిజనులు పార్వతీపురం ఐటీడీఏ వద్ద రిలే నిరాహార దీక్షలకు దిగారు.అనారోగ్యం బారిన పడిన వారిని డోలీలతో తరలించే బాధల నుంచి తమకు విముక్తి కలిగించాలని డిమాండ్ చేస్తున్నారు.సరైన రహదారి లేక గర్భణీలను ప్రమాదకరంగా డోలీలో తరలిస్తుంటే,కొన్ని సార్లు తల్లిబిడ్డా కూడా చనిపోతున్నారని వాపోయారు.ఇటీవల13కీ.మీ దూరం డోలీతో తీసుకెళ్లినా,తల్లిబిడ్డా మృత్యువాత పడిన ఘటనను వారు ఉదహరిస్తున్నారు.కొన్ని దశాబ్దాలుగా రహదారి సౌకర్యం లేక అవస్థలు పడుతున్నామని,ఇకనైనా తమ ప్రాంతానికి వాహనాలు వచ్చేలా చూడాలని గిరిజనులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details