ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 9, 2021, 4:55 PM IST

ETV Bharat / state

ఎన్నికల నిర్వహణపై ఉద్యోగులకు శిక్షణ

ఎన్నికల నిర్వహణపై విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఉద్యోగులకు శిక్షణ ఇచ్చారు. పోలింగ్ ప్రారంభం నుంచి కౌంటింగ్ పూర్తయ్యే వరకు పాటించాల్సిన విధివిధానాలను తెలియజేశారు. అభ్యంతరాలు, సందేహాల నివృత్తికి ఎవరిని సంప్రదించాలో వివరించారు.

training session to election officers at parvatipuram
ఎన్నికల అధికారులకు పార్వతీపురంలో శిక్షణా కార్యక్రమం

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై.. ఉద్యోగులకు విజయనగరం జిల్లా పార్వతీపురంలో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద పీవోలకు.. లైన్స్ కళ్యాణ మండపం వద్ద స్టేజ్ టు రిటర్నింగ్ అధికారులకు శిక్షణ ఇచ్చారు. పోలింగ్ కేంద్రానికి చేరుకోవడం నుంచి ఎన్నికలు సజావుగా నిర్వహించే వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు.

అభ్యంతరాలు, సందేహాలు ఎదురైతే ఎవరిని సంప్రదించాలి? ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్న విషయాలను ఈ శిక్షణా కార్యక్రమంలో వివరించారు. పోలింగ్ ప్రారంభం నుంచి కౌంటింగ్ పూర్తయ్యే వరకు పాటించాల్సిన విధివిధానాలను తెలియజేశారు. అన్ని చోట్ల నిబంధనల ప్రకారం ఎన్నికలు సజావుగా జరిగేందుకు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.

ఇదీ చదవండి:'విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను కేంద్రం విరమించుకోవాలి'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details