ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'గ్రామ వాలంటీర్​ పోస్టుల్లో అన్యాయం' - పార్వతీపురం

గ్రామ వాలంటీర్ పోస్టుల నియామకంలో తీవ్ర అన్యాయం జరిగిందంటూ గిరిజనులు ఆవేదన చెందుతున్నారు. అర్హులైన తమను పట్టించుకునేవారు లేరని కన్నీరు పెట్టుకున్నారు.

tibes_agitaion_for_village_volunteers

By

Published : Aug 6, 2019, 10:12 AM IST

'గ్రామ వాలంటీర్​ పోస్టులలో అన్యాయం జరిగింది'

విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో గిరిజనులకు గ్రామ వాలంటీర్ల నియామకంలో అన్యాయం జరిగిందని పలువురు నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. పాచిపెంట మండలం పనుకువలస పంచాయతీ పెద్ద చీపురు వలస గ్రామానికి చెందిన గిరిజనులు ఈ విషయంపై... ఐటీడీఏ పీవో వినోద్ కుమార్​కు ఫిర్యాదు చేసేందుకు కార్యాలయానికి వెళ్లారు. ఆయన అందుబాటులో లేని కారణంగా... రాత్రి వరకు వేచి ఉన్నారు.

పోస్టులకు ఏడుగురి దరఖాస్తు

పనుకువలస గ్రామంలో 150 కుటుంబాలు ఉన్నాయి. ఏడుగురు అభ్యర్థులు వాలంటీర్ల పోస్ట్​లకు దరఖాస్తు చేసుకున్నారు. ఐదుగురు ఇంటర్వ్యూకి హాజరయ్యారు. ఐదుగురికీ పోస్టులు రాలేదని అభ్యర్థులు వాపోయారు. కొంతమంది నాయకులు చేతివాటమే.. తమకు జరిగిన అన్యాయానికి కారణమని ఆరోపించారు. ప్రజా ప్రతినిధులు మండల అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు.

ABOUT THE AUTHOR

...view details