ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయనగరంలో ముగ్గురు వలస కూలీలకు కరోనా - కరోనా కేసులు

విజయనగరం జిల్లాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. కొత్తగా మరో మూడు కేసులు నమోదవ్వటంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. కొత్తగా నమోదైన వాటితో జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య ఏడుకు చేరింది.

three more corona positive cases registered in vizianagaram district
విజయనగరంలో ముగ్గురు వలస కూలీలకు కరోనా నిర్ధరణ

By

Published : May 15, 2020, 5:12 PM IST

విజయనగరం జిల్లాలో కొత్తగా మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ పరీక్షలకు సంబంధించి ఇవాళ ప్రకటించిన బులిటెన్​లో ముగ్గురికి కరోనా సోకినట్లు నిర్ధారణ కాగా... జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య ఏడుకు చేరింది. దీంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.

జిల్లాలోని బలిజపేట మండలం చిలకలపల్లికి చెందిన 60ఏళ్ల వృద్ధురాలు మినహా... మిగిలిన కేసులన్నీ వలసదారులవే కావటం గమనార్హం. గతంలో నమోదైన నాలుగు కేసుల్లో చిలకలపల్లికి చెందిన వృద్దురాలు... కరోనా, కిడ్ని, మధుమేహం వ్యాధులతో బాధపడుతూ మృతి చెందింది. మిగిలిన వారు కొవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details