విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణం నిరసన కార్యక్రమాలతో హోరెత్తింది. సమస్యలకు పరిష్కారం చూపాలని వివిధ సంఘాలు ధర్నాలు చేపట్టాయి. ఎనిమిది నెలలుగా జీతాలు చెల్లించలేని కారణంగా...ప్రకాశం జిల్లా గిద్దలూరు రక్తం నిల్వ కేంద్రంలో పనిచేస్తున్న టెక్నీషియన్ నాగేశ్వర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. అందుకు నిరసనగా పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రి రక్తనిధి కేంద్ర సిబ్బంది నల్ల రిబ్బన్లు ధరించి...పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టారు.
నిరసనలతో మార్మోగిన పార్వతీపురం - గిద్దలూరు
తమ సమస్యలకు పరిష్కారం చూపాలని కోరుతూ... వివిధ సంఘాలు పార్వతీపురంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాయి.
నిరసనలతో మార్మోగిన పార్వతీపురం
ఇవీ చదవండి...తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు