ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వం ప్రగల్భాలు.. పుస్తకాలు లేక విద్యార్థుల ఇబ్బందులు - పార్వతీపురం మన్యం జిల్లా

Textbook shortage: నాడు - నేడు, అమ్మఒడి లాంటి పథకాలతో పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నామని ప్రభుత్వం, సీఎం పదేపదే చెబుతున్నారు. అయితే, విజయనగరం జిల్లాలో 18, పార్వతీపురం మన్యం జిల్లాలో 14 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పాఠ్యాపుస్తకాలు అందుబాటులో ఉంచకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. తెలుగు మాధ్యం విద్యార్థులకు అరకొరగా అందచేసినా, ఆంగ్లం మాధ్యానికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పుస్తకం అందించకపోవటం గమనార్హం. ఈ పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్దులు వాపోతున్నారు.

Textbook shortage
Textbook shortage

By

Published : Nov 17, 2022, 10:00 PM IST

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో అందని పుస్తకాలు

Textbook shortage negatively impacts in AP: నాడు - నేడు, అమ్మఒడి లాంటి పథకాలతో పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నామని ప్రభుత్వం, సీఎం పదేపదే చెబుతున్నారు. ఇవి విద్యాలయాల అభివృద్ధి.. విద్యార్థులను పాఠశాలలకు రప్పించడానికి ఉపయోగపడతాయని గొప్పగా చెప్పారు. విద్యార్థికి జ్ఞనాన్ని అందించేది మాత్రం పాఠ్యపుస్తకాలు, బోధనా సిబ్బంది. అవి లేకుండా చదువుకునేది ఎలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులు.

విజయనగరం జిల్లాలో 18, పార్వతీపురం మన్యం జిల్లాలో 14 ప్రభుత్వ జూనియర్ కళాశాలలున్నాయి. జులై 20వ తేదీతో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలు ముగిశాయి. 2 నెలల పాటు ఎలాంటి పాఠ్య పుస్తకాలు లేకుండానే విద్యార్థులు తరగతులకు హాజరయ్యారు. కొన్నిచోట్ల సీనియర్ల వద్ద పాత పుస్తకాలు సేకరించి పంపిణీ చేశారు. బహిరంగ మార్కెట్లో పాఠ్యాపుస్తకాలు అందుబాటులో ఉంచకపోవడంతో కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడిందని.... అక్కడక్కడా స్టడీ మెటీరియలు జిరాక్స్ తీసుకొని చదువుకుంటున్నామని విద్యార్థులు చెబుతున్నారు.

ఆదర్శ, కస్తూర్బా, ఎయిడెడ్ జూనియర్ కళాశాలల విద్యార్థులకు ఏటా ప్రభుత్వమే పుస్తకాలు ఉచితంగా అందిస్తోంది. ప్రతి సంవత్సరం., వేసవి సెలవుల్లోనే కళాశాలల ప్రిన్సిపాళ్లు ప్రాంతీయ సంయుక్త సంచాలకుల ద్వారా ఇండెంట్ పెడతారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థుల సంఖ్య కళాశాలల వద్దే ఉంటుంది. గతేడాది ప్రవేశాలతో ఈ ఏడాది ప్రథమ సంవత్సరంలో చేరే పిల్లల సంఖ్యను అంచనా వేసి ఎన్ని పుస్తకాలు అవసరమో వివరాలు పంపిస్తారు. ఈ మేరకు ఉమ్మడి విజయనగరంలో ప్రథమ సంవత్సరం విద్యార్ధులకు 20,160 పాఠ్యపుస్తకాలు, ద్వితీయ సంవత్సరం పిల్లలకు 20,579 పాఠ్యపుస్తకాలు రావాలి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 40,748పాఠ్యపుస్తకాలు అందాల్సి ఉంది. విద్యా సంవత్సరం ఆరంభానికి ముందే ఇవి చేరుకోవాలి. రెండేళ్లుగా పుస్తకాలు రాపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. తెలుగు మాధ్యం విద్యార్థులకు అరకొరగా అందచేసినా., ఆంగ్లం మాధ్యానికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పుస్తకం అందించకపోవటం గమనార్హం. ఈ పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్దులు వాపోతున్నారు.

'ఇంటర్ పాఠ్యపుస్తకాలు ప్రభుత్వం నుంచి అందకపోవటమే ఇందుకు కారణం. అయితే., పాత పుస్తకాలు ఉండటంతో తెలుగు మీడియం విద్యార్ధులకు రెండేళ్లుగా 80శాతం మందికి ఇచ్చాము. ఇంటర్ లో ఆంగ్ల మాద్యం ఇటివలే ప్రవేశపెట్టడంతో, వారికి పాఠ్యపుస్తకాలు అందివ్వలేక పోయాం.' - ఇంటర్ పర్యవేక్షణ అధికారి, విజయనగరంజిల్లా

కళాశాలలో మౌలిక వసతులు సంగతి ఎలా ఉన్నా., కనీసం పాఠ్యపుస్తకాలను అందించకపోవటం విచారకరమంటున్నారు. ఈ ఏడాది ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వలేం, రాబోయే విద్యాసంవత్సరం పూర్తిగా అందిస్తామని.. స్వయాన విద్యాశాఖ మంత్రి చెబుతున్నారు. ఇంటర్ పాఠ్యపుస్తకాల అవసరాన్ని ప్రభుత్వం ముందుగానే ఎందుకు గుర్తించలేదని.. విద్యార్థి సంఘాలు మండి పడుతున్నాయి.


ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details