శ్రావణ మాసంలో శుక్రవారం అంటేనే మహిళలకు అత్యంత పర్వదినం. ఈ మాసంలో వచ్చే మూడో శుక్రవారం నాడు మహిళలు వరలక్ష్మి వ్రతం చేసుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కానీ ప్రస్తుతం కరోనా వల్ల విజయనగరం జిల్లాలో ఆ సందడి కనిపించడం లేదు. యువతులు, మహిళలతో కిటకిటలాడే దేవాలయాలు బోసిపోయాయి. భౌతిక దూరం, శానిటైజర్లు, మాస్కులు వంటి వాటితో విసిగిపోయిన మహిళలు దేవాలయాలకు రాకుండా ఇంటి వద్దనే పూజలు కానిచ్చేస్తున్నారు. దేవాలయాలకు వచ్చే పుణ్యస్త్రీలకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి దూరం నుంచే ఆశీర్వదించి పంపించేస్తున్నారు. భక్తుల తాకిడి లేకపోవడం వల్ల పూజారులు దేవతామూర్తులకు ఏకాంత సేవలు నిర్వహిస్తున్నారు.
జిల్లాలో వెలవెలబోయిన ఆలయాలు.. ఇళ్ల వద్దనే పూజలు
కరోనా పుణ్యమా అని విజయనగరం జిల్లాలో శ్రావణ మాసం సందడి దేవాలయాల్లో కనుమరుగైంది. ఎప్పుడూ మహిళలు, యువతులతో శ్రావణ శుక్రవారాలు సందడిగా కనిపించే ఆలయాలు భక్తుల తాకిడిని మర్చిపోయింది. మహిళలు తమ ఇళ్లలోనే పూజలు చేసేందుకు ప్రాధాన్యమిస్తున్నారు.
మూడో శ్రావణ శుక్రవారం నాడు బోసిపోయిన జిల్లాలోని ఆలయాలు