ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఊరుకాని ఊరులో... అవ్వ అవస్థలు - పార్వతిపురంలో తెలంగాణ అవ్వ

మా అన్నయ్య వస్తాడంటూ... ఓ వృద్ధురాలు మూడు రోజులుగా రోడ్డు పక్కనే ఎదురు చూస్తోంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ అవ్వ విజయనగరం వచ్చింది. రోడ్డు పక్కనే ఉన్న మెట్లపై ఉంటూ... స్థానికులు పెట్టింది తిని కాలం వెళ్లదీస్తోంది.

telangana old lady in paravathipuram
ఊరుకాని ఊరొచ్చి... అవ్వ అవస్థలు

By

Published : Jun 10, 2020, 8:58 AM IST

Updated : Jun 10, 2020, 10:05 AM IST

తెలంగాణ బామ్మ... ఆంధ్రాలో అవస్థలు

ఎక్కడి నుంచి వచ్చిందో... ఎలా వచ్చిందో తెలియదు గానీ.... దయ గల తల్లులు అందించే ఆహారం తింటూ... తన అన్న రాక కోసం.. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వృద్ధురాలు ఎదురుచూస్తోంది. విజయనగరం జిల్లా పార్వతీపురంలోని బెలగాం నాయుడు వీధిలో రోడ్డు పక్కన ఓ వృద్ధురాలు మూడు రోజులుగా కాలం వెల్లదీస్తోంది. ఈ విషయాన్ని స్థానికులు ఈనాడు-ఈటీవీ భారత్ దృష్టికి తీసుకురాగా... ఆమె వివరాలు సేకరించారు. ఆమె వద్ద ఉన్న రైలు టికెట్‌పై ఎస్​.సత్యవతి 75 ఏళ్ల వయసు... రామగుండం టూ విశాఖ అని ఉంది. విశాఖ నుంచి బస్సులో పార్వతీపురం చేరుకున్నట్లు బాధితురాలు చెబుతోంది. తనకు ఎవరూ లేరని స్వగ్రామం కావనపురం అని కూరగాయల వ్యాపారం చేసి జీవనం సాగించినట్లు చెబుతోంది. ఈనాడు-ఈటీవీ భారత్​ ఆధ్వర్యంలో ఆమెకు కరోనా పరీక్షలు చేయించి.. నెగిటివ్‌ నిర్ధరణ తర్వాత బస కేంద్రానికి తరలించారు.

Last Updated : Jun 10, 2020, 10:05 AM IST

ABOUT THE AUTHOR

...view details