విజయనగరం జిల్లా సాలూరు మండలాల్లో కరెంట్ బిల్లులు ఎక్కువ మొత్తంలో రావడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్యే భాను దేవ్, తెలుగుదేశం పార్టీ నేతలు నిరసన చేపట్టారు. పెంచిన కరెంట్ బిల్లులపై అన్ని మండలాల పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి బిల్లుకు సమానమైన బిల్లులు లాక్ డౌన్ లో మూడు నెలల్లో కట్టించుకోవాలని.. కరెంట్ బిల్లు పైన శ్లాబ్ విధానాన్ని తీసివేయాలని.. నాయకులు డిమాండ్ చేశారు.
విద్యుత్ బిల్లుల పెంపుపై తెదేపా నేతల దీక్ష - tdp protest in against current bill in salluru
పెంచిన కరెంటు బిల్లులపై విజయనగరం జిల్లా సాలూరులో తెదేపా నేతలు నిరసన దీక్ష చేపట్టారు. కరెంట్ బిల్లు పైన శ్లాబ్ విధానాన్ని తీసివేయాలని డిమాండ్ చేశారు.
పెరిగిన కరెంట్ బిల్లు పై టీడీపీ నిరసన దీక్ష లు