తెదేపా ప్రభుత్వం హామీలను గాలికి వదిలేసింది :జగన్ విజయనగరం జిల్లా పార్వతీపురంలో వైకాపా రాష్ట్ర అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిప్రచారం చేపట్టారు.పట్టణ శివారులో పాత బస్టాండ్ వద్ద బహిరంగ సభ నిర్వహించారు . తెలుగుదేశం పరిపాలనలోపార్వతీపురం మున్సిపాలిటీ అభివృద్ధికి నోచుకోలేదనిఆరోపించారు తోటపల్లి ప్రాజెక్టుని దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి 90 శాతం పూర్తి చేశారని.. ఉన్న పది శాతాన్ని పూర్తిస్థాయిలో చంద్రబాబు పూర్తి చేయలేదన్నారు.తమ పార్టీ అధికారంలోకి వస్తే రైతులు,విద్యకు పెద్ద పీట వేస్తామని హామీ ఇచ్చారు. పార్వతీపురం అభ్యర్థి జోగారావు, అరకు పార్లమెంట్ అభ్యర్థి మాధవిలను గెలిపించాలని కోరారు
ఇవి చదవండి