ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎద్దుల బండే రథం.... గురువే రాజు.... - vijaya naganram

ఉపాద్యాయుడి మీదున్న ప్రేమతో ఎద్దుల బండి రథంపై ఆయన్ను ఊరేగించారీ విద్యార్థులు... మాష్టారు విరమణ కార్యక్రమమని తెలిసినా బాధను దిగమింగి నవ్వుతూ... పువ్వులు విసిరిమరీ కార్యక్రమ వేదికకు ఊరేగింపుగా తీసుకువెళ్లారు.

ఎద్దుల బండే రథం.... గురువే రాజు....

By

Published : Aug 1, 2019, 12:47 PM IST

అప్పుడెప్పుడో సర్వేపల్లి రాధా కృష్ణను వారి శిష్యులు రథంపై లాగారని విన్నాం... వారినే మించి పోయేంత ఆలోచన చేశారా విద్యార్థులు. తెలుగు మాష్టారు రుణం తీర్చుకోవడానికి ఎద్దుల బండినే రథంలా మార్చేశారు. స్వయానా వారే బండి లాగి గురువు రుణం తీర్చుకున్నారు.

విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం నాగూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు దూసి రాంప్రసాద్​ బుధవారం ఉద్యోగ విరమణ చేశారు. ఆయన సేవలు గుర్తిండిపోయేలా ఆ విద్యార్థులు... రాంప్రసాద్​ దంపతులను ఎడ్లబండిపై రాజా, రాణీ లా కూర్చోబెట్టి పువ్వులు చల్లతూ... సన్మాన వేదిక వరకు ఊరేగిస్తూ.. ఘనంగా తీసుకువెళ్లారు. మాతృభాషను తనదైన శైలిలో బోధించి వందలాది పిల్లల భవిష్యత్తును తీర్చి దిద్దిన ఆ ఉపాధ్యాయుడి రుణం... ఇలా వినూత్న రీతిలో తీర్చుకున్నారీ విద్యార్థులు

ఎద్దుల బండే రథం.... గురువే రాజు....

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details