విజయనగరం జిల్లా సాలూరు పరిధిలో మూసేసిన ప్రభుత్వ పాఠశాలలను తెరిపించాలంటూ... బోసుబొమ్మ జంక్షన్లో విద్యార్థులు రాత్రి నుంచి ధర్నాకు దిగారు. ఈ నిరసనలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, గిరిజన ఆదివాసీ సంఘాలు పాల్గొన్నాయి. సాలూరు పరిధిలో సుమారు 40 ప్రాథమిక పాఠశాలలను ప్రభుత్వం మూసివేసింది. దీనివల్ల దాదాపు 2 వేల మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యారంటూ వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి పాఠశాలలను తెరిపించాలని కోరుతున్నారు.
'చదువుకు దూరమవుతున్నాం.. మూతపడిన 40 పాఠశాలలు తెరవండి' - మూతపడ్డ 40 ప్రభుత్వ పాఠశాలలను తెరవాలని విద్యార్థలు ధర్నా
విజయనగరం జిల్లా సాలూరు పరిధిలో సుమారు 40 ప్రభుత్వ పాఠశాలలను అధికారులు మూసివేయడంపై.. విద్యార్థులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. వాటిని వెంటనే తిరిగి తెరిపించాలంటూ ధర్నాకు దిగారు. తమ పిల్లలకు న్యాయం చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
students-darna-in-vizayanagaram-saluru