electric shock in hostel compound: విజయనగరం జిల్లా గజపతినగరం బీసీ కళాశాల వసతి గృహనికి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థి కావాటి ఆశీస్ విద్యుదాఘాతానికి గురయ్యాడు. వసతి గృహం మెట్లపై స్నేహితునితో మాట్లాడుతుండగా.. విద్యుత్ తీగకు చేయి తగిలింది. దాంతో ఆశీస్ ఒక్కసారిగా ప్రమాదం జరిగింది. విద్యుదాఘాతంతో అపస్మారక స్థితికి చేరిన ఆశీస్ను తోటి విద్యార్థులు కాపాడే ప్రయత్నం చేశారు. వెంటనే అతడిని విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. విద్యార్థికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సకాలంలో స్పందించి వెంటనే ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు.
వసతి గృహంలో విద్యార్థికి విద్యుదాఘాతం... ఆసుపత్రికి తరలింపు - గజపతినగరం బీసీ కళాశాల వసతి గృహ విద్యార్థి
Student electric shock in hostel: బీసీ కళాశాల వసతి గృహంలో ఉంటున్న విద్యార్థి విద్యుదాఘాతానికి గురయ్యాడు. వెంటనే స్పందించిన తోటి విద్యార్థులు, వసతిగృహ సిబ్బంది అతడిన హుటాహుటిన విజయనగరంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
electric shock in hostel