తరగతిలోనే విద్యార్థిని మృతి.. బోరుమన్న కళాశాల - vizayanagaram
విజయనగరం జిల్లా పార్వతీపురంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో విషాదం చోటు చేసుకుంది. రోజూ మాదిరిగానే కాలేజికి వచ్చిన ఇంటర్ విద్యార్థిని నందిని తరగతి గదిలోనే కన్నుమూసింది.
student_died_with_asthama_in_vizayanagaram
విజయనగరం జిల్లా పార్వతీపురంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ విద్యార్థిని నందిని కన్నుమూసింది. కెఎన్ఆర్ఆర్ వలస గ్రామానికి చెందిన నందిని ఆస్తమాతోనే కళాశాలకు హాజరైంది. గదిలో తీవ్ర ఆయాసంతో పడిపోవడంతో యాజమాన్యం, విద్యార్థులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందింది. తమ సహచర విద్యార్థిని మృతి చెందడంతో విద్యార్థులు బోరున విలపించారు.