విజయనగరం జిల్లా పార్వతీపురంలో గిరిజన సంఘం రాష్ట్ర మహాసభలు ప్రారంభమయ్యాయి. రెండు రోజులపాటు నిర్వహించే ఈ సభలకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి పాత బస్టాండ్ వరకు గిరిజన నాయకులు భారీ ర్యాలీగా వెళ్లారు. డప్పు వాయిద్యాలతో సందడి చేస్తూ మహిళలు, పలువురు నాయకులు నృత్యాలతో భారీ ప్రదర్శనగా సభా వేదికకు చేరుకున్నారు. ముఖ్యఅతిథులుగా త్రిపుర మాజీ మంత్రి జితేంద్ర చౌదరి, మాజీ ఎంపీ మెడియం బాబురావులు పాల్గొన్నారు.
ఘనంగా ప్రారంభమైన గిరిజన సంఘం రాష్ట్ర మహాసభలు
రెండు రోజుల పాటు జరపనున్న గిరిజన సంఘం రాష్ట్ర మహాసభలు విజయనగరం జిల్లా పార్వతీపురంలో ప్రారంభమయ్యాయి.
ఘనంగా ప్రారంభమైన గిరిజన సంఘం రాష్ట్ర మహాసభలు
TAGGED:
parvathipuram latest updates