రామతీర్థాల్లో శ్రీరామనవమికి విస్తృత ఏర్పాట్లు - విజయనగరం జిల్లా
విజయనగరం జిల్లా రామతీర్ధం రామాలయంలో.. శ్రీరామనవమికి విస్తృత ఏర్పాట్లు చేశారు.
రామతీర్థాల్లో శ్రీరామనవమికి విస్తృత ఏర్పాట్లు
విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్ధాల్లో శ్రీరామ నవమి కళ్యాణానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. రామతీర్ధం సీతారాములు ఆలయం అనువంశీక ధర్మకర్త.. ఎంపీ అశోకగజపతిరాజు దంపతులు ఆదివారం కల్యాణం సందర్భంగా పట్టవస్త్రాలను సమర్పిస్తారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా ఒడిశా, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారు.