ఐఐటీలో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో దేశవ్యాప్తంగా 43 వేల 204 మంది అర్హత సాధించారు. బాలురు 36 వేల 497 మందికాగా.. బాలికలు 6 వేల 707 మంది.. దివ్యాంగులు 436 అర్హత సాధించారు. దేశవ్యాప్తంగా 23 ఐఐటీల్లో 13 వేల 600 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మహారాష్ట్రకు చెందిన చిరాగ్ ఫాలర్ 396 మార్కుల్లో 352 సాధించి.. జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకును కైవసం చేసుకున్నాడు. బాలికల విభాగంలో కనిష్క మిత్తల్ 315 మార్కులతో అగ్రస్థానం సాధించింది. ఈ ఏడాది రెండున్నర లక్షల మందికి అర్హత ఉన్నప్పటికీ.. లక్షా 50 వేల 838 మంది మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు హాజరయ్యారు.
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. కడప జిల్లా బుడ్డాయిపల్లెకు చెందిన గంగుల భువన్‌రెడ్డి జాతీయస్థాయిలో రెండోర్యాంకు సాధించాడు. ఓబీసీ విభాగంలో విజయనగరం విద్యార్థి ఎల్.జితేంద్ర తొలి ర్యాంక్ సాధించగా..దివ్యాంగుల కేటగిరిలో కందుకూరి సునీల్ కుమార్ విశ్వేష్.. మొదటి ర్యాంకు కైవసం చేసుకున్నారు. కుమార్ సత్యం 22వ ర్యాంకు సాధించగా.. ఏలూరు విద్యార్థి కాపెల్లి యశ్వంత్ సాయి జాతీయ స్థాయిలో... 32వ ర్యాంక్ కైవసం చేసుకున్నాడు. విజయవాడ విద్యార్థి చిలుకూరి మణి ప్రణీత్‌కు.. ఓబీసీ విభాగంలో రెండు, జాతీయ స్థాయిలో 47వ ర్యాంకు వచ్చింది. మంచిర్యాల విద్యార్థి అన్నం సాయివర్దన్... ఓబీసీ విభాగంలో 7, జాతీయ స్థాయిలో 93వ ర్యాంకు సాధించాడు.