ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొఠియా గ్రామ పంచాయతీ ఎన్నికలను పర్యవేక్షించిన ఎస్పీ రాజకుమారి - second phase panchayat elections latest news

విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని కొఠియా గ్రామంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలను జిల్లా ఎస్పీ రాజకుమారి పర్యవేక్షించారు. అధికారులను పోలింగ్​ శాతాన్ని అడిగి తెలుసుకొవటంతో పాటు.. అక్కడున్న ఓటర్లతో మాట్లాడారు.

sp rajakumari
కొఠియా గ్రామ పంచాయతీ ఎన్నికలను పర్యవేక్షించిన ఎస్పీ రాజకుమారి

By

Published : Feb 13, 2021, 5:05 PM IST

పార్వతీపురం నియోజకవర్గం, సాలూరు మండలంలోని ఆంధ్ర - ఒడిశా సరిహద్దు వివాద పంచాయతీల్లో ఒకటైన కొఠియా పంచాయతీ ఎన్నికలను జిల్లా ఎస్పీ రాజకుమారి పర్యవేక్షించారు. అధికారులను పోలింగ్​ శాతాన్ని అడిగి తెలుసుకోవటంతో పాటు.. అక్కడున్న ఓటర్లతో మాట్లాడారు. సమస్యాత్మక ప్రాంతమైనప్పటికి.. ఇక్కడ పోలింగ్ శాతం అధికంగా ఉందని అధికారులు.. ఎస్పీకి తెలిపారు. అంతకు ముందు కొదమ పంచాయతీ, మామిడిపల్లి పోలింగ్​ స్టేషన్​లను కూడా పరిశీలించారు.

ABOUT THE AUTHOR

...view details