ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యార్థుల మేధస్సుకు వేదిక... వైజ్ఞానిక ప్రదర్శన

పిల్లల ఆసక్తిని గుర్తించి ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారు. వారిలో దాగి ఉన్న విజ్ఞానాన్ని వెలికి తీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు వేదికలవుతున్నాయి. విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది.

sciencefare-in-parwathipuram
పార్వతీపురంలో వైజ్ఞానిక ప్రదర్శన

By

Published : Feb 27, 2020, 10:32 PM IST

పార్వతీపురంలో వైజ్ఞానిక ప్రదర్శన

విజయనగరం జిల్లా పార్వతీపురం విశ్వ విజ్ఞాన పాఠశాలలో వైజ్ఞానిక ప్రదర్శనను నిర్వహించారు. సోలార్, విండ్​ విద్యుత్, డ్రిప్ ఇరిగేషన్, సూక్ష్మదర్శిని ప్రాజెక్టు, కార్బోహైడ్రేట్స్ పవర్ ఇరిగేషన్, సౌరశక్తితో కాలువలో చెత్త తొలగింపు వంటి ప్రయోగాలు ఆకట్టుకున్నాయి. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో పట్టణంలోని వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులు తాము చేసిన ప్రయోగాలతో పాల్గొన్నారు. ఈ ప్రదర్శనను తిలకించేందుకు భారీ సంఖ్యలో విద్యార్థులు తరలివచ్చారు. ప్రయోగ విధానాన్ని ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details