ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశం

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 26న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొనాలని.. ఏపీ రైతు సంఘం విజయనగరం అధ్యక్షులు రాంబాబు పిలుపునిచ్చారు. రైతు, కార్మిక, ఉద్యోగ సంఘాల నాయకులతో.. ఎల్​బీజీ భవన్​లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

round table meet
రౌండ్​ టేబుల్​ సమావేశంలో మాట్లాడుతున్న నేతలు

By

Published : Nov 24, 2020, 8:41 PM IST

కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలతో.. దేశంలోని రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఏపీ రైతుసంఘం విజయనగరం అధ్యక్షులు రాంబాబు మండిపడ్డారు. నగరంలోని ఎల్​బీజీ భవన్​లో.. రైతు, కార్మిక, ఉద్యోగ సంఘాల నాయకుల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 26వ తేదీన జరుగనున్న సార్వత్రిక సమ్మెలో.. రైతులు, కూలీల సంఘాలు, వివిధ సంస్థలు, మేధావులు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈనెల 26న సార్వత్రిక సమ్మె, 27న కేంద్ర కార్యాలయాల వద్ద నిరసన చేపడతామని తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details