విజయనగరం జిల్లా పార్వతీపురం నుంచి పాలకొండ వెళ్లే ప్రధాన రహదారి గుంతలు మయంగా మారింది. ఈ మార్గంలో ప్రజా ప్రతినిధులు అధికారులు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. అయినప్పటికీ గోతులు నేతల కళ్లకు కనిపించలేదు. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లన్నీ మరింత అధ్వానంగా మారాయి. పరిస్థితిని చూసిన పార్వతీపురం మాజీ కౌన్సిలర్, డీఎన్ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ ద్వారపురెడ్డి శ్రీనివాసరావు స్పందించారు. సొంత నిధులతో పట్టణ శివారులోని పై వంతెన దిగువున కొత్తవలస వద్ద అద్వానంగా ఉన్న మార్గాన్ని తాత్కాలికంగా బాగు చేశారు. తోటపల్లి బ్యారేజీ సమీపంలో ఐటీడీఎ పార్క్ వద్ద గుంతలను పూడ్చారు. దీంతో వాహన చోదకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
మాజీ కౌన్సిలర్ ఉదారత.. సొంత నిధులతో రోడ్డుకి మరమ్మతులు
పల్లెలకు.. పట్టణాలకు మధ్య ఉన్న ఆ రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది. ప్రజలతో పాటు నేతలు తిరిగే ప్రధాన రహదారి అది. కానీ ఆ రహదారిపై గుంతలు ప్రమాదాలకు నిలయాలుగా మారాయి. ఈ పరిస్థితి గమనించిన మాజీ కౌన్సిలర్ ఒకరు ముందుకొచ్చి సొంత నిధులతో రోడ్డుకి మరమ్మతులు చేయించారు.
సొంత నిధులతో రోడ్లు మరమ్మత్తులు