ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మబ్బులు, ఈదురుగాలులు సరే.. వర్షాలెక్కడ?

విజయనగరం జిల్లా పార్వతీపురం పరిసర ప్రాంతాల్లో మూడు రోజులుగా వర్షాలు పడొచ్చని ఆశగా ఎదురుచూస్తున్న నగర వాసులకు నిరాశే ఎదురవుతోంది. మబ్బులు కమ్ముకుంటున్నా, ఈదురుగాలులు వీస్తున్నా... వర్షం కురవడం లేదు. బలంగా వీచే గాలులకు మామిడి, అరటి పంటలకు నష్టం వాటిల్లుతోంది.

చినుకు రాలేనా... భానుడి ప్రతాపం ఆగేనా..!

By

Published : May 16, 2019, 12:28 PM IST

Updated : May 20, 2019, 9:46 AM IST

చినుకు రాలేనా... భానుడి ప్రతాపం ఆగేనా..!

విజయనగరం జిల్లా పార్వతీపురం పరిసర ప్రాంతాల్లో మూడు రోజులుగా మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం రెండు వరకూ భానుడు భగ్గుమంటున్నాడు. సాయంకాలానికి మబ్బులు కమ్ముకోవడం నగర వాసుల్లో వర్షాలపై ఆశలు పెంచుతోంది. ఈదురు గాలులు వీస్తుంటే వర్షం పడొచ్చని ఆశగా ఎదురుచూసిన జనాలకు... చివరికి నిరాశే ఎదురవుతోంది. మూడు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలుగా.. రాత్రికి కనిష్టం 28 డిగ్రీలుగా నమోదవుతోంది. మరోవైపు సాయంత్రపు వేళ వీచే గాలులకు మామిడి, అరటి పంటలకు నష్టం వాటిల్లుతోంది.

Last Updated : May 20, 2019, 9:46 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details