పార్వతీపురంలో వర్షం... చల్లబడిన వాతావరణం - rain in parvathipuram
పార్వతీపురంలో జోరు వర్షం కురవటంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉక్కపోతతో ఇబ్బందిపడుతున్న ప్రజలు దీంతో ఊరట పొందారు.
పార్వతీపురంలో వర్షం...చల్లబడిన వాతావరణం
గతం వారం రోజులుగా ఎండ తీవ్రత, ఉక్కపోతతో అల్లాడుతున్న జనాలకు ఊరట లభించింది. వరుణుడు కరుణించటంతో వాతావరణం చల్లబడింది. విజయనగరం జిల్లా పార్వతీపురంలో మధ్యాహ్నం వరకు భానుడి భగభగలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సాయంత్ర జోరుగా వర్షం కురవటంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. దుక్కులకు ఈ వర్షం అనుకూలమని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
TAGGED:
rain in parvathipuram