విజయనగరం జిల్లా సాలూరు పోలింగ్ కేంద్రంలో అధికారుల కారణంగా ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 11వ వార్డు పోలింగ్ కేంద్రంలో ఒంటి గంట సమయానికి 35% అనగా 455 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. మెుత్తం ఇక్కడ 1260 మంది ఓటర్లు ఉన్నారు. ఇంకా చాలా మంది ప్రజలు ఇబ్బందులు పడుతూ క్యూలో వేచి ఉన్నారు. గంటల తరబడి వేచి ఉండాల్సిన వస్తోందని ఓటర్లు ఆవేదన చెందుతున్నారు. ఎక్కడా నీటి సౌకర్యం లేదని .. మరో వైపు ఎండవేడికి తాళలేక పోతున్నామన్నారు. కరోనా మార్గ దర్శకాలు కూడా కనిపించటం లేదని విమర్శించారు. ఈ విషయంపై అధికారులు వేగంగా స్పందించాలని ఓటర్లు కోరుతున్నారు.
సాలూరులో ఓటర్ల అవస్థలు - సాలూరులో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల సమస్యలు
విజయనగరం జిల్లా సాలూరులో ఓటర్లు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓటింగ్ ప్రక్రియ నిదానంగా సాగుతుండటంతో ప్రజలు గంటల తరబడి క్యూలో వేచి ఉండాల్సి వస్తోంది. అధికారులు వెంటనే స్పందించి పరిష్కారం చూపాలని ఓటర్లు విజ్ఞప్తి చేస్తున్నారు.
సాలూరులో ఓటర్ల అవస్థలు