వినాయకచవితి సందర్భంగా ఎలాంటి ప్రమాదకర సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఏఎస్పీ గౌతమి సాలి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడిన ఆమె... ఉత్సవాల నిర్వహణకు పోలీసుల అనుమతి తప్పనిసరి అని చెప్పారు. ఊరేగింపులు ప్రజలకు ఇబ్బంది లేకుండా చేపట్టాలని సూచించారు. ముందుగా పోలీసుల అనుమతి తీసుకుని ఊరేగింపులు చేపట్టాలని చెప్పారు. బాణాసంచా కాలిస్తే వారిపై చట్టపరంగా చర్యలు ఉంటాయని వెల్లడించారు. వినాయక నిమజ్జనం చేసేటప్పుడు కూడా పోలీసుల అనుమతి ఉండాలని అన్నారు.
వినాయక చవితి ఉత్సవాలకు పోలీసుల అనుమతి తప్పనిసరి - చర్యలు
వినాయకచవితికి పోలీసులు ముందుగానే చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడా ఎలాంటి ప్రమాదం జరగకుండా చూసుకోవాలనే ఉద్దేశంతో కఠిన చర్యలు తీసుకుంటున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఏఎస్పీ గౌతమి సాలి ఈ చర్యలు గురించి మీడియా సమావేశం నిర్వహించారు.
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న డీసీపీ