విజయనగరం జిల్లా రామతీర్థంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. రాముడి విగ్రహం ధ్వంసం నేపథ్యంలో...అధికార, విపక్షాలు నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడంతో కొండ ప్రాంతం వద్ద హడావుడి నెలకొంది. ఆ ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళ్తున్న తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత, కార్యకర్తల వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులను తప్పించుకుని అనిత ఆటోలో వెళ్లారు.
అడ్డుకున్న పోలీసులు...ఆటోలో వెళ్లిన తెదేపా నేత అనిత - vizianagram latest news
రామతీర్థం చుట్టూ చేరిన రాష్ట్ర రాజకీయం వేడెక్కింది. 3 పార్టీల నినాదాలు, తోపులాటతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నంచిన తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనితను పోలీసులు అడ్డుకున్నారు.
ఆటోలో వెళ్లిన తెదేపా నేత అనిత