ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భారీగా నాటుసారా పట్టివేత..తొమ్మిది మంది అరెస్ట్ - సాలూరులో భారీగా నాటుసారా పట్టివేత

సాలూరులో భారీగా నాటుసారా ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు.

Police have seized a large quantity of Natsara packets in Saluru
సాలూరులో భారీగా నాటుసారా పట్టివేత

By

Published : Oct 13, 2020, 1:34 PM IST

విజయనగరం జిల్లా సాలూరులో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 2వేల 800 నాటుసారా ప్యాకెట్లును స్వాధీనం చేసుకున్నారు.

వివరాల్లోకి వెళితే...

స్పెషల్ బ్రాంచ్ వారు ఇచ్చిన సమాచారం మేరకు సాలూరు పట్టణ ఎస్ఐ ఫక్రుద్దీన్ వారి సిబ్బందితో వాహన తనిఖీలు నిర్వహించారు. సాలూరు రైల్వే స్టేషన్ దగ్గరలో ఆటోలో 14 యూరియా బస్తాల్లో రెండు వేల ఎనిమిది వందలు నాటు సారా ప్యాకెట్లు అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. మెుత్తం తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని...రిమాండ్​కు తరలించారు. నాటుసారా ప్యాకెట్లు మెుత్తం విలువ 42వేల రూపాయల వరకు ఉంటుందని భావిస్తున్నారు.

భారీగా నాటుసారా పట్టివేత

అంతేకాకుండా ఈ సంఘటన జరిగిన మరో రెండు గంటల్లో బైక్​తో మూడు ప్లాస్టిక్ క్యాన్ల్​తో 60 లీటర్లు నాటుసారా తరలిస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు.

ఇదీ చదవండి:కలర్‌ జిరాక్స్‌తో నకిలీ నోట్లు.. పోలీసుల అదుపులో నిందితులు

ABOUT THE AUTHOR

...view details