రాష్ట్రవ్యాప్తంగా మహాశుద్ధి కార్యక్రమాలను అధికారులు చేపడుతున్నారు. విజయనగరం జిల్లా కలెక్టర్ ఇవాళ విజయనగరం మధ్యలో ఉన్న పెద్దచెరువులో వ్యర్థాలు తొలగించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్... వివిధ శాఖల అధికారులు, పోలీస్ సిబ్బంది, స్వచ్ఛంద సంస్ధలు, విద్యార్ధులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. పెద్ద చెరువు శుద్ధి మా బాధ్యత అంటూ అందరితోనూ కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు.
పెద్ద చెరువులో మహాశుద్ధి చేపట్టిన జిల్లా కలెక్టర్ - పెద్దచెరువులో మహాశుద్ధి
విజయనగరంలో ఉండే పెద్ద చెరువుకు జిల్లా కలెక్టరు హరిజవహర్ లాల్ మహాశుద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
vzm
అనంతరం చెరువులో పుడుకుపోయిన వ్యర్ధాలు, గుర్రెపు డొక్కులు, చెత్త, క్యారీ బ్యాగ్ లను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. విజయనగరం ప్రజల చీరకాల కోరిక పెద్ద చెరువును సంరక్షించడమని, తమ వంతు బాధ్యతగా నేడు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని జిల్లా కలెక్టర్ హరిజవహర్ అన్నారు. నిరంతరం ఈ శుద్ధి కార్యక్రమం జరుగుతుందని... మంచి ప్రకృతి వాతవరణంలో ఉండే విధంగా చెరువును తయారు చేయడానికి అందరు తమ వంతు బాధ్యతగా సహకరించాలన్నారు.