పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో వైకాపా నేతల ఒత్తిడితో అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ఆరోపించారు. విజయనగరం జిల్లా కొత్తవలస పంచాయతీలో రీకౌంటింగ్ చేయాలంటూ.. తెదేపా మద్దతుదారులు చేపట్టిన నిరహార దీక్షకు పట్టాభి మద్దతు తెలిపారు.
పల్లెపోరులో ప్రభుత్వం వ్యవహరించిన తీరు దారుణం: పట్టాభి - vizianagaram district newsupdates
విజయనగరం జిల్లా కొత్తవలస పంచాయతీలో రీకౌంటింగ్ చేయాలని.. తెదేపా మద్దతుదారులు చేపట్టిన నిరహార దీక్షకు పట్టాభి సంఘీభావం తెలిపారు. పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో వైకాపా నేతల ఒత్తిడితో అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారని.. తెదేపా నేత పట్టాభిరామ్ విమర్శించారు.
పల్లె పోరులో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై పట్టాభి మండిపాటు
పల్లెపోరులో తెలుగుదేశం మద్దతుదారు బోని తిరుపతిరావు 268 ఓట్ల మెజార్టీతో గెలిచారని.. స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాసరావు ఒత్తిడితో వైకాపా బలపరిచిన అభ్యర్థి 10 ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారని ఆరోపించారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని.. న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు.