ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పార్వతీపురం డివిజన్​లో కరవైన భౌతిక దూరం - parvathipuram people not maintaining social distance latest news

పార్వతీపురం ప్రజలు.. భౌతిక దూరాన్ని మరుస్తున్నారు. కరోనా వ్యాప్తికి పరోక్షంగా కారణం అవుతున్నారు.

parvathipuram division people are not maintaining social distance
ఆసుపత్రి వద్ద బారులు తీరిన పార్వతీపురం ప్రజలు

By

Published : Jun 6, 2020, 6:19 PM IST

లాక్​డౌన్​ సడలింపులతో ప్రజల రాకపోకలు పెరిగాయి. చాలా మంది సామాజిక దూరాన్ని పాటించడమే మానేశారు. ఇలాంటివారి తీరు వైరస్ వ్యాప్తికి ఆస్కారం కలిగించేదిగా ఉంది. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో ఈ పరిస్థితే కనబడుతుంది. పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రిలో కొవిడ్​ పరీక్షల కోసం, గృహ క్వారంటైన్​ పత్రాల కోసం ప్రజలు అధిక సంఖ్యలో వస్తున్నారు. వందలాది మంది బారులు తీరుతూ... భౌతిక దూరం మాటే మరుస్తున్నారు.

ఆర్టీసీ కాంప్లెక్స్​లోనూ ఇదే తీరు కనబడుతోంది. పట్టణాల్లోనే కాకుండా గ్రామాల్లోనూ కరోనా కేసులు నమోదవుతున్నాయి. పార్వతీపురం డివిజన్​లో గరుగుబిల్లి, పార్వతీపురం, బలిజిపేట మండలాలతో పాటు.. క్వారంటైన్ కేంద్రాల్లోనూ పాజిటివ్ కేసులు వచ్చాయి. అయినా... బయటికి వస్తున్న జనం కనీసం భౌతిక దూరం పాటించకుండా కొవిడ్​ వ్యాప్తికి ఆస్కారం ఇచ్చేలా నడుస్తున్నారు. సామాజిక దూరం పాటించాలని పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖ పదే పదే సూచిస్తున్నా... పెద్దగా స్పందన కనిపించడం లేదు.

ABOUT THE AUTHOR

...view details