కరోనా నేపథ్యంలో విలువైన సేవలందిస్తున్న పోలీసు, పారిశుద్ధ్య, వైద్య, పాత్రికేయ సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతూ.. విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో ఓ చిత్రకారుడు రహదారిపై భారీ చిత్రాన్ని గీశాడు. రఫీ అనే పెయింటర్ ముంతాజ్ మాల్ యజమాని సహకారంతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. రాత్రంతా కష్టపడి వేసిన ఈ బొమ్మ అందరినీ ఆకట్టుకుంటోంది. జిల్లా ఎస్పీ రాజకుమారి.. రఫీని అభినందించారు.
'మీ సేవలు అమూల్యం.. మీకిదే మా వందనం'
కరోనా మహమ్మారి ప్రజలందరినీ వణికిస్తున్న వేళ.. తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవలందిస్తున్న పోలీసు, వైద్య, పాత్రికేయ, పారిశుద్ధ్య సిబ్బందికి పలువురు వివిధ రూపాల్లో తమ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో చిత్రకారుడొకరు రోడ్డుపై భారీ చిత్రాన్ని గీసి అభిమానాన్ని చాటుకున్నాడు.
అత్యవసర సేవల సిబ్బందికి కృతజ్ఞతలతో..