పైడితల్లి సిరిమానోత్సవంలో కీలక ఘట్టానికి అంకురార్పణ జరిగింది. సిరిమానును తీసుకొచ్చే ప్రక్రియను ఆలయ అధికారులు... శాస్త్రోక్తంగా నిర్వహించారు. విజయనగరం జిల్లా జామి మండలం భీమసింగి సమీపంలోని బలరాంపురంలో గుర్తించిన సిరిమానుకు... సంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహించి కోత మొదలుపెట్టారు.
కార్యక్రమంలో ఎంపీ బెల్లన చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు శ్రీనివాసరావు, కోలగట్ల వీరభద్రస్వామి పాల్గొన్నారు. అనంతరం సిరిమాను చెట్టుని.. ఊరేగింపుగా విజయనగరం హుకుంపేటలోని పూజారి ఇంటికి చేర్చారు. ఈనెల 27న జరగనున్న సిరిమానోత్సవానికి కరోనా పరిస్థితుల దృష్ట్యా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆలయ పూజారి తెలిపారు.