పైడితల్లి అమ్మవారి ఉచిత దర్శనం నిలిపివేత - విజయనగరంలో పైడితల్లి జాతర
విజయనగరం ప్రజల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి జాతరలో సిరిమానోత్సవానికి ముందు జరిగే ప్రధాన ఘట్టమైన తోలేళ్ల ఉత్సవం సోమవారం ప్రారంభమైంది. జాతరను యథావిధిగా నిర్వహించేందుకు అధికారులు నిర్ణయించారు.
విజయనగరం ప్రజల ఆరాధ్య దైవం, ఇలవేల్పయిన పైడితల్లి అమ్మవారి జాతరలో భాగంగా సిరిమానోత్సవానికి ముందు జరిగే ప్రధాన మట్టమైన తోలేళ్ల ఉత్సవం సోమవారం ప్రారంభమైంది. కొవిడ్ నిబంధనలతో ఈ ఏడాది నిరాండరంగా.. భక్తులకు దూరంగా పండగను జరిపేందుకు అధికారులు నిర్ణయించారు. జాతరను మాత్రం యథావిధిగా నిర్వహించేందుకు నిర్ణయించారు. అమ్మవారి జాతరకు ఈనెల 26,27 తేదీలలో భక్తులు అధికంగా వచ్చే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకొని ఉచిత దర్శనాలు ఆపివేశారు. దర్శనం టికెట్లను ఆన్ లైన్ లో టికెట్ ధర 200 రూపాయలుగా విక్రయిస్తున్నారు. దీంతో అమ్మవారి దర్శనానికి భక్తులు ఆశించిన స్థాయిలో రావడం లేదు. పైడితల్లమ్మ ఆలయం వద్ద క్యూ లైన్లన్నీ బోసిపోయాయి.
ఇవీ చదవండి: పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న సంచైత గజపతిరాజు