రాష్ట్రంలో విస్తారంగా కురిసిన వర్షాలకు రిజర్వాయర్లు, చెరువులు నిండుకుండను తలపిస్తున్నాయి. పాచిపెంట మండలం గురివినాయుడు పేటకు కిలోమీటర్ దూరంలో పెద్దగెడ్డ రిజర్వాయర్ కుడికాలువ నుంచి నీరు ఉప్పొంగి జలపాతాన్ని తలపిస్తోంది.
ఈ ప్రకృతి అందాన్ని వీక్షించేందుకు వస్తున్న పర్యటకుల తాకిడి.. క్రమంగా పెరుగుతోంది. చిన్నారులు, విద్యార్థులతో.. సందడిగా మారింది. పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రకృతి ప్రేమికులు... ఈ జలపాతాల వద్ద స్నానాలు చేస్తూ..కేరింతలు కొడుతున్నారు.