ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'గిరిజనుల భూములపై సర్వే చేసి పట్టాలు ఇవ్వండి' - పాటిపెంట వార్తలు

గిరిజన రైతుల భూములపై సర్వే చేసి పట్టాలు ఇవ్వాలని కోరుతూ విజయనగరం జిల్లా పాచిపెంట మండలంలో నిరసన చేపట్టారు. అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

vizianagaram district
గిరిజనుల భూమి సర్వే చేసి పట్టాలి ఇవ్వండి

By

Published : Jul 16, 2020, 9:52 PM IST

విజయనగరం జిల్లా పాచిపెంట మండలం కొండతాడూరు, తోకమెట్ట, మెట్టవలస, వేటగానివలస తదితర గ్రామాల్లో కుడుమూరు భూపోరాట కమిటీ ఆధ్వర్యంలో గిరిజనులు నిరసన దీక్ష చేపట్టారు. రెవెన్యూ సర్వే నెం 48లో సాగు చేస్తున్న గిరిజన రైతులకు సర్వే చేసి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గిరిజనులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కోరారు.

కోడుమూరు రెవెన్యూ డివిజన్​లో సుమారు 10 గ్రామాల గిరిజన రైతులు సాగు చేస్తున్నారని.. వారికి హక్కులు లేకపోవటం వలన ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అధికారులను పట్టాలు ఇవ్వాలని కోరుతున్నా.. సమస్య పరిష్కారం చేయటం లేదని అన్నారు. భూమికి సంబంధం లేని గిరిజనేతరులు వచ్చి బెదిరింపులుకు దిగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details