ఓట్లు తొలగింపు వైకాపా దుశ్చర్యే! తెదేపాకు ప్రజాదరణ చూసి ఓర్వలేకనే వైకాపా నేతలు ఓట్ల తొలగింపునకు పాల్పడుతున్నారని రాష్ట్ర భూగర్భగనుల శాఖ మంత్రి సుజయ కృష్ణ రంగారావు ఆరోపించారు. ఆ తప్పు తెదేపా కిఅంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహించారు. వైకాపానే ప్రణాళికబద్ధంగా ఓట్ల తొలగింపు దుశ్చర్యలకు పాల్పడుతోందని స్పష్టం చేశారు. తన సొంత నియోజకవర్గం బొబ్బిలిలో వెలుగు చూసిన అంశాలే ఇందుకు నిదర్శనమన్నారు. ఈ విషయంపై ఎన్నికల సంఘం లోతుగా విచారణ జరపాలని మంత్రి డిమాండ్ చేశారు.