వంతెన మరమ్మతులు పూర్తి... ప్రారంభించిన ఎమ్మెల్యే
విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గం సీతానగరం సువర్ణముఖి నదిపై మరమ్మతులు చేపట్టిన వంతెనను ఎమ్మెల్యే జోగారావు ప్రారంభించారు.
విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గం సీతానగరం సువర్ణముఖి నదిపై అత్యవసర మరమ్మతులు చేపట్టిన వంతెనను ఎమ్మెల్యే జోగారావు ప్రారంభించారు. కొద్ది నెలల కిందట వంతెన మధ్యలో రంధ్రం పడింది. దశాబ్దాల చరిత్ర ఉన్న వంతెన శిథిలావస్థకు చేరడంతో ఎమ్మెల్యే… కోటి 29 లక్షల రూపాయల వ్యయంతో అత్యవసర మరమ్మతులు చేయించారు. రాకపోకలకు ఇబ్బంది లేకుండా బ్రిడ్జి దిగువ భాగంలో తాత్కాలిక నిర్మాణం చేపట్టారు. వర్షాకాలంలో మట్టి రోడ్డు కొతకు గురయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బ్రిడ్జికి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేశారు. బ్రిడ్జిని పునఃప్రారంభించడంతో పార్వతీపురం - విశాఖ మార్గంలో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తొలగాయి.