రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుంటే విజయనగరంజిల్లాలో మాత్రం ఇప్పటి వరకు ఒక్క కేసు నమోదు కాలేదు. విదేశాల నుంచి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు ఇప్పటి వరకు 476 మంది తిరిగొచ్చారు. వీరిలో 352 మందిని అధికారులు హోం క్వారంటైన్ లో ఉంచారు. నిన్నటితో 124 మంది హోమ్ క్వారంటైన్ పూర్తి చేసుకున్నారు. అదే విధంగా జలుబు, దగ్గు, జ్వరం వంటి అనుమానిత కరోనా లక్షణాలతో... జిల్లా నుంచి ఇప్పటి వరకు 13 మంది నమూనాలను కరోనా పరీక్షా కేంద్రాలకు పంపారు. వీరందరి ఫలితాలన్నీ నెగిటివ్గా వచ్చాయి. దిల్లీ ప్రార్ధనా సభలో పాల్గొన్న 12 మందిలోనూ ఇప్పటి వరకూ కోవిడ్-19 లక్షణాలు వెలుగుచూడలేదు. అయినప్పటికీ కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి అధికారులు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నారు.
కరోనా పాజిటివ్ కేసు లేని జిల్లా మీకు తెలుసా?
ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా మహమ్మారి రాష్ట్రంలోనూ గుబులు పుట్టిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కానీ ఈ జిల్లాలో మాత్రం ఇంత వరకూ ఒక్క కేసు నమోదు కాలేదు.
కరోనా పాజిటివ్ కేసు లేని విజయనగరం జిల్లా