విజయనగరం జిల్లా శృంగవరపుకోటకు చెందిన సాత్విక్ నాయుడు అనే ఆరేళ్ల బాలుడు అద్భుత ప్రతిభ కనబరుస్తున్నాడు. ఒక నిమిషం సమయంలో మూలకాల పేర్లు చెబుతూ ఆశ్చర్యపరుస్తున్నాడు. తెలుగు సంవత్సరాల పేర్లు, నక్షత్రాల పేర్లు, పురాణాలు, పర్వాలు, భగవద్గీత శ్లోకాలు, వేమన శతకం పద్యాలు వంటివి అవలీలగా చెబుతూ ఆశ్చర్యపరుస్తున్నాడు.
చిన్నారి అద్భుత ప్రతిభకు అందరూ ఫిదా - sringavarapukota latest news updates
విజయనగరం జిల్లా శృంగవరపుకోటకు చెందిన సాత్విక్ నాయుడు అనే బాలుడు మంచి ప్రతిభ ప్రదర్శిస్తున్నాడు. మూలకాలు, తెలుగు సంవత్సరాలు, పురాణాలు, నక్షత్రాల పేర్లు చెబుతూ అందరి మన్ననలు పొందుతున్నాడు.
అద్భుత ప్రతిభ చూపిస్తున్న బాలుడు
ప్రముఖ నటుడు చిరంజీవి జన్మదిన సందర్భంగా ఆయన నటించిన సినిమాల పేర్లను చెప్పాడు. అసాధారణ జ్ఞాపకశక్తి ప్రదర్శిస్తున్న సాత్విక్ నాయుడిని పలువురు అభినందిస్తున్నారు. చిరంజీవికి శుభాకాంక్షలు తెలుపుతూ చేసిన వీడియోను చిరు అభిమాన సంఘం ద్వారా ఆయనకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదీచదవండి.