ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మూఢ నమ్మకాలు.. కవల శిశువుల పాలిట శాపం

విజయనగరం జిల్లా పాచిపెంట మండల పరిధిలోని గిరిజన గ్రామాల్లో పెద్దల మూఢ నమ్మకాలు అభం శుభం తెలియని పసికందుల ప్రాణాల మీదకు తీసుకొచ్చాయి. చర్మవ్యాధి కారణంతో కవల పిల్లల పొట్టపై వాతలు పెట్టి చిత్రహింసలు పెట్టిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

'మూఢనమ్మకాలతో కవల శిశువుల పొట్టలపై వాతలు'

By

Published : May 10, 2019, 7:31 PM IST

'మూఢనమ్మకాలతో కవల శిశువుల పొట్టలపై వాతలు'
విజయనగరం జిల్లా ఊపుగుడ్డి గ్రామంలో దారుణం జరిగింది. మూఢ నమ్మకం కవల శిశువుల ప్రాణాలకు సంకటంగా మారింది. చర్మవ్యాధి సోకిందనే కారణంతో చిన్నారుల పొట్టలపై పైడమ్మ అనే ముసలమ్మ వాతలు పెట్టింది. ఇది జరిగిన కొద్ది రోజులకే ఆ ముసలమ్మ, చిన్నారుల తల్లి మరణించారు. పిల్లలకు పాలిచ్చేవారు లేక ఆరోగ్యం క్షీణించిన ఆ ఇద్దరి చిన్నారులను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించటంతో వాతల విషయం వెలుగులోకి వచ్చింది. నొప్పితో విలవిలలాడుతున్న చిన్నారులకు వైద్యులు చికిత్స అందించి ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచారు. ప్రాణాపాయం లేకుండా శాయాశక్తులా కృషి చేస్తామని వైద్యులు తెలిపారు.

గ్రామాల్లో ఇలాంటి ఘటనలో తరచూ జరుగుతూనే ఉన్నాయని... గ్రామస్థుల్లో మూఢనమ్మకాలపై అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటికైనా జనాల్లో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details