చీపురుపల్లి ఇండోర్ స్టేడియంలో ఎం ఎస్ నాయుడు బ్యాడ్మింటన్ టోర్నమెంట్ను ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ప్రారంభించారు. జిల్లా బ్యాడ్మింటన్ అధ్యక్షుడు రఘురామరాజు పాల్గొన్నారు. 2001 నుంచి చీపురుపల్లి షటిల్ బ్యాడ్మింటన్ కోచింగ్ క్యాంపు వారు పోటీలు నిర్వహిస్తున్నారు. సుమారు 20 మంది విద్యార్థులతో మొదలైన ఈ కోచింగ్ క్యాంప్ ప్రతి ఏటా నిర్వహిస్తూ... నేటికి 160 మంది విద్యార్థులు పాల్గొనే స్థాయికి ఎదిగింది.
ఈ పోటీల ద్వారా అనేక మంది క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులుగా గుర్తింపు పొందారు. ఈ ఏట పోటీల్లో సుమారు 78 జట్లు పాల్గొంటున్నాయి. పోటీదారులకు ఎంపీ.. టీ షర్టులు అందజేశారు. విద్యార్థులకు ఇది ఓ చక్కని అవకాశమని ఆయన చెప్పారు. పోటీలను సద్వినియోగం చేసుకుని ప్రతిభను చాటాలన్నారు.