నిబంధనలకు విరుద్ధంగా వెళ్లే వాహనదారులపై కేసులు నమోదు చేసి జరిమానా వసూలు చేస్తున్నారు పోలీసులు. అయినా కొన్ని చోట్ల చాలా మంది నిబంధనలు ఖాతరు చేయడం లేదు. వారికి తెలియని విషయం ఏమిటంటే గతంలో శిరస్త్రాణానికి ఒకటి, సీటు బెల్టుకు ఒకటి, ఇలా ఒక్కో తప్పునకు ఒక్కో రకంగా జరిమానా ఉండేది. కానీ.. ప్రభుత్వ ఆదేశాల ఉల్లంఘన చట్టం కింద ఇప్పుడు అందరూ రూ.530 చెల్లించాల్సిందే. కచ్చితంగా ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని, ఇందులో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని పోలీసులు చెబుతున్నారు.
అతిక్రమించిన వారిపైనే చర్యలు: