విజయనగరం జిల్లా పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రిలో వ్యాధి నిర్ధరణ పరీక్షల కేంద్రంలో ఆధునిక పరికరాలను ఏర్పాటు చేశారు. ఈ పరికరాలను ఎమ్మెల్యే జోగారావు ప్రారంభించారు. మారుమూల పల్లెలకు సైతం ఆధునిక వైద్యం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందన్నారు. ప్రాంతీయ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆధునిక పరికరాల సేవలను అంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ వాగ్దేవి, పలువురు వైద్యులు, నాయకులు పాల్గొన్నారు.
పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రిలో ఆధునిక వైద్య పరికరాలు
మారుమూల ప్రాంతాలకు సైతం ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన వ్యాధి నిర్ధరణ ఆధునిక పరికరాలను ఆయన ప్రారంభించారు.
పరికరాలు ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే అలజంగి జోగారావు