విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో కరోనా కారణంగా చిన్నారులు ఎవరూ జెండా వందన కార్యక్రమానికి హాజరు కాలేదు. దీంతో స్వాతంత్య్ర వేడుకల్లో జెండా ఆవిష్కరణ అనంతరం సాలూరు శాసన సభ్యులు రాజన్న దొర తానే స్వయంగా పాట పాడి దేశభక్తిని చాటుకున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో జెండా ఎగుర వేసిన ఆయన "ఎగరాలి.. ఎగరాలి.. స్వాతంత్య్ర జెండా" అంటూ పాట పాడి అందరిలోనూ దేశభక్తిని పెంపొందించి చైతన్య పరిచారు.
జాతీయ పతాకం ఎగురవేసి..జెండా వందనం పాట పాడిన ఎమ్మెల్యే - జాతీయ పతాకం ఎగురవేసి..జెండా వందనం పాట పాడిన ఎమ్మెల్యే
కరోనా నేపథ్యంలో జెండా వందన కార్యక్రమానికి పిల్లలు హాజరు కాకపోవడంతో ఎమ్మెల్యేనే జెండా ఆవిష్కరణ అనంతరం ”ఎగరాలి జెండా” అంటూ పాట పాడారు. ఈ ఘటన విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో జరిగింది.
జాతీయ పతాకం ఎగురవేసి..జెండా వందనం పాట పాడిన ఎమ్మెల్యే