ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వ్యవసాయాన్ని పండుగలా మార్చడమే వైకాపా కృతనిశ్చయం' - ycp on tdp

గత ప్రభుత్వం రైతులకు చెల్లించాల్సిన రూ.596 కోట్ల బకాయిలను వైకాపా ప్రభుత్వం చెల్లించిందని ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి అన్నారు. రైతుల సంక్షేమం కోసం సీఎం జగన్​ వినూత్న పథకాలు తీసుకువచ్చారన్నారు. రైతుల ఇంటి ముంగిటే సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చాలన్న కృతనిశ్చయంతో వైకాపా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి
ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి

By

Published : Jun 26, 2020, 6:12 PM IST

రైతు సంక్షేమం పట్టని గత ప్రభుత్వం 2018 రబీ పరిహారాన్ని చెల్లించలేదని ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి అన్నారు. రైతుల సంక్షేమానికి పాటుపడే సీఎం జగన్​... ఆ బకాయిలు తీర్చారన్నారు. వ్యవసాయ రంగానికి నూతన జవసత్వాలు తెచ్చేందుకు సీఎం జగన్​ వినూత్నమైన పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. రైతుల ఇంటి ముంగిటే సేవలు అందించేలా... రైతు భరోసా కేంద్రాలు తెచ్చారన్నారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చాలన్న కృతనిశ్చయంతో సీఎం పనిచేస్తున్నారని పేర్కొన్నారు.

2018లో అప్పటి తెదేపా ప్రభుత్వం.. రైతులకు రబీ సీజన్ పరిహారాన్ని చెల్లించకుండా బకాయి పెట్టిందని పుష్ప శ్రీవాణి అన్నారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు రూ. 596 కోట్లను వైకాపా ప్రభుత్వం రైతులకు చెల్లించిందన్నారు. విజయనగరం జిల్లాకు చెందిన 6185 మంది రైతులకు రూ.3.03 కోట్ల పరిహారం అందిస్తున్నామని ఉపముఖ్యమంత్రి వెల్లడించారు.

ఇదీ చదవండి :చెల్లింపులే జరగనప్పుడు అవినీతి ఎక్కడిది: నారా లోకేశ్

ABOUT THE AUTHOR

...view details