ఘనంగా ఉపముఖ్యమంత్రి పుట్టిన రోజు వేడుకలు
రాష్ట్ర మంత్రివర్గంలో అతి చిన్న వయస్కురాలైన పుష్పశ్రీవాణి తన పుట్టిన రోజు వేడుకలను అభిమానులు, కార్యకర్తల మధ్య జరుపుకుంది.
అభిమానులతో మంత్రి
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్పశ్రీ వాణి జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలోని తన పుట్టిన రోజును జరుపుకున్నారు. జియ్యమ్మవలస మండలం చినమేరంగి గ్రామంలోని మంత్రి నివాసానికి కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున చేరుకుని పుష్పశ్రీవాణికి శుభాకాంక్షలు తెలిపారు.