ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రాజకీయ వేధింపులు ఆపండి... మధ్యాహ్న భోజన బకాయిలు చెల్లించండి' - Mid Day Meals Workers protest news

మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ... సీఐటీయూ ఆధ్వర్యంలో విజయనగరం కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు.

Mid Day Meals Workers Dharna in Vizianagram
మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ధర్నా

By

Published : Mar 31, 2021, 7:45 PM IST

మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ... సీఐటీయూ ఆధ్వర్యంలో విజయనగరం కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్మికుల యూనియన్ ప్రధాన కార్యదర్శి బొత్స సుధారాణి మాట్లాడుతూ.... బకాయిలు ఉన్న బిల్లులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికులపై రాజకీయ వేధింపులు ఆపాలని కోరారు.

రూ.3వేలు వేతనం చెల్లించాలి:

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 3వేల రూపాయల గౌరవ వేతనాన్ని ప్రతి నెల చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రమంతటా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

మర్రిపాడులో క్షుద్ర పూజల కలకలం... భయాందోళనలో ప్రజలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details