ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Mansas Trust: మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ అశోక్‌ గజపతిరాజు పలు కీలక నిర్ణయాలు - మాన్సాస్ ట్రస్ట్​లో అవినీతి తాజా వార్తలు

మాన్సాస్ ట్రస్ట్ (Mansas Trust) ఛైర్మన్ అశోక్‌ గజపతిరాజు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మాన్సాస్ ట్రస్టు (Mansas Trust) కార్యకలాపాల వివరాలు ఇవ్వాలని ట్రస్టు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌కు అశోక్ గజపతిరాజు ఆదేశాలు జారీ చేశారు. పదేళ్లుగా ఆడిటింగ్‌కు చెల్లించిన ఫీజు వివరాలు ఇవ్వాలన్నారు. ట్రస్టు భూముల్లో ఇసుక తవ్వకాలకు ఎవరు అనుమతించారో తెలపాలి గజపతిరాజు అన్నారు.

mansas trust chairman ashok gajapathi raju key decisions in trust mange
మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ అశోక్‌ గజపతిరాజు పలు కీలక నిర్ణయాలు

By

Published : Jun 17, 2021, 6:03 PM IST

మాన్సాస్ ట్రస్టు(Mansas Trust) ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన అశోక్ గజపతిరాజు.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మాన్సాస్ ట్రస్టు(Mansas Trust) కార్యకలాపాలపై పదేళ్లుగా ఆడిటింగ్ జరగలేదన్న ఆరోపణల దృష్ట్యా.. ఆడిట్ కోసం చెల్లించిన ఫీజు వివరాలను ఈ నెల 21వ తేదీలోగా అందజేయాలని అధికారులను ఆదేశించారు.

తూర్పుగోదావరి జిల్లా కోటిపల్లిలోని మాన్సాస్ ట్రస్టు భూముల్లో ఇసుక తవ్వకాల అనుమతులపై నివేదిక ఇవ్వాలని అశోక్ గజపతిరాజు అన్నారు . విద్యాసంస్థల బడ్జెట్ ప్రతిపాదనలను వారంలో తయారు చేయాలని, సిబ్బంది జీతాలకు చెల్లింపునకు వెంటనే చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు.

గత ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 5లక్షల రూపాయలు దాటిన కార్యాలయ కొనుగోళ్లకు వివరాలను రెండు రోజుల్లో అందించాలని ట్రస్టు ఛైర్మన్ సూచించారు. లీజు గడువు పూర్తయిన ట్రస్టు భూములకు వెంటనే వేలం నిర్వహించాలంటూ.. ట్రస్ట్ కార్యాలయ అధికారులకు అశోక్‌ గజపతి ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చదవండి:

Mansas Trust: మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్​గా ప్రథమ ప్రాధాన్యత విద్యకే: అశోక్ గజపతిరాజు

ABOUT THE AUTHOR

...view details