ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బొబ్బిలిలో ప్రధాన పార్టీల విస్త్రత ప్రచారం - బొబ్బిలిలో స్థానిక ఎన్నికల ప్రచారాలు

విజయనగరం జిల్లా బొబ్బిలిలో పురపాలక ఎన్నికల ప్రచారాలు ఊపందుకున్నాయి. వైకాపా, తెదేపా అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. మరోవైపు ఎన్నికల ఏర్పాట్లను అధికారులు వేగంగా చేపడుతున్నారు.

Election campaigns
బొబ్బిలిలో ప్రధాన పార్టీల విస్త్రత ప్రచారం

By

Published : Feb 27, 2021, 3:44 PM IST

బొబ్బిలిలో ప్రధాన పార్టీలు విస్త్రత ప్రచారాన్ని ఆరంభించాయి. పోటాపోటీగా తమ అభ్యర్థులను గెలిపించుకోవాలని నేతలు యత్నిస్తున్నారు. తెదేపా నేత బొబ్బిలి యువరాజ బేబీనాయన, మాజీఎమ్మెల్యే తెంటు లక్ష్మీనాయుడు వార్డుల్లో పర్యటించి.. తమ పార్టీ అభ్యర్థలకు ఓటు వేయాలంటూ కోరారు. అధికార పార్టీ ఎమ్మెల్యే సంబంగి వెంకట చిన్నప్పనాయుడు పట్టణంలో పర్యటించి తమ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు.

అధికారులు ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు కల్పిస్తున్నారు. పురపాలక కార్యాలయంలోనే కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. బ్యాలెట్ పెట్టెలను కట్టుదిట్టంగా భద్రపరిచారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పురపాలక కమిషనర్ ఎం.ఎం.నాయుడు, పురపాలక ప్రత్యేక అధికారి, జిల్లా సంయుక్త కలెక్టర్ వెంకటరావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి

ఇదీ చదవండీ..ప్రకాశం బ్యారేజ్‌ పైనుంచి కృష్ణా నదిలోకి దూకిన మహిళ

ABOUT THE AUTHOR

...view details